Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలంటూ యువకుడి వేధింపులు

  • కేరళలోని కోజికోడ్‌లో ఘటన
  • ఘటనలో లవ్ జిహాద్ కోణం
  • జాతీయ దర్యాప్తు సంస్థకు కేసు
యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన యువకుడు ఆ దృశ్యాలను వీడియా తీశాడు. ఆపై వాటిని చూపించి ఇస్లాంలోకి మారాలని, లేకుంటే వాటిని బయటపెడతానని బెదిరించాడు. యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో లవ్ జిహాద్ కోణం ఉండడంతో పోలీసులు దీనిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు. కేరళలోని కోజికోడ్‌లో వెలుగు చూసిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. ఫజల్ (21), బాధిత యువతి(19) ఓ ట్యూషన్ సెంటర్‌లో క్లాస్‌మేట్స్. ఈ ఏడాది జూలైలో ఆమెకు మత్తుమందు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమె నగ్న ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆపై వాటిని చూపించి ఇస్లాంలోకి మారాలంటూ ఒత్తిడి చేశాడు. లేకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

ఫజల్ పదేపదే వేధింపులకు గురిచేస్తుండడంతో  యువతి తన బాధను హాస్టల్‌లోని తన స్నేహితులకు చెప్పింది. అనంతరం విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లి గత నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, కేసులో ‘లవ్ జిహాద్’ ఛాయలు కనిపిస్తుండడంతో పోలీసులు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. దీంతో ఎన్ఐఏ అధికారులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఫజల్ తనను బెదిరిస్తూ ఇస్లాంలోకి మారాలని వేధిస్తున్నాడని యువతి పేర్కొంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Kerala
kozhikode
love jihad
NIA

More Telugu News